కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా సినిమా షూటింగ్స్ విషయంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సినిమా షూటింగ్స్ ను గరిష్టంగా 50 మందితో మాత్రమే జరపాలని ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరిగే చోట అవసరమైన అన్ని కరోనా నిబంధనలను, జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ నిర్ణయాలను తెలుగు చిత్ర పరిశ్రమను అనుసరిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు ఏప్రిల్ 20, మంగళవారం నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్లను మూసివేయాలని తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లను నడపడంపై ఈ రోజు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించి, కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థియేటర్లు మూసివేతకే ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ