ఉస్మానియా ఆస్పత్రిలో 5 రూపాయలకే భోజన పథకం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Hyderabad Minister Harish Rao Launches 5 Rupees Meals at Osmania Hospital Today, Minister Harish Rao Launches 5 Rupees Meals at Osmania Hospital Today, Telangana Minister Harish Rao Launches 5 Rupees Meals at Osmania Hospital Today, Harish Rao Launches 5 Rupees Meals at Osmania Hospital Today, Minister Harish Rao inaugurated 5 Rupees Meals at Osmania Hospital Today, Minister Harish Rao Starts 5 Rupees Meals at Osmania Hospital Today, Minister Harish Rao inaugurate 5 Rupees Meals at Osmania Hospital Today, 5 Rupees Meals at Osmania Hospital, 5 Rupees Meals, Osmania Hospital, Hyderabad Minister Harish Rao, Telangana Minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Finance Minister T Harish Rao, T Harish Rao Telangana Finance Minister, Osmania Hospital News, Osmania Hospital Latest Nerws, Osmania Hospital Latest Updates, Osmania Hospital Live Updates, Mango News, Mango News Telugu,

హైద‌రాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ప‌రిధిలో గల మొత్తం 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల వెంట ఉండే స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా 5 రూపాయలకే భోజ‌నం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభమైంది. ఈరోజు ఉస్మానియా ఆస్ప‌త్రిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఈ 5 రూపాయలకే భోజ‌నం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్స్ కు ఆస్ప‌త్రి లోప‌ల ఉచితంగా భోజ‌నం అందిస్తామని, అదే విధంగా వారి సహాయకులకు ఆస్పత్రి ప్రాంగణం లోనే కేవలం రూ. 5 లకే భోజనం అందించబడుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప మాన‌వ‌తావాది, ఆయన మాన‌వ‌త్వానికి మారు పేరు అని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద‌లు క‌డుపు నిండా భోజ‌నం చేయాల‌నే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు వివరించారు.

గ‌తంలో సీఎం ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు రోగులతో పాటు ఉండే వారి స‌హాయ‌కుల ఇబ్బందుల‌ను గ‌మ‌నించారని, దీంతో వెంటనే వారి కోసం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల వ‌ద్ద నైట్ షెల్ట‌ర్లు నిర్మించాల‌ని ఆదేశించారని హరీష్ రావు గుర్తు చేశారు. అలాగే వారికి సరైన భోజన వసతి లేకపోవడాన్ని చూసి బాధపడ్డారని, ఈ దిశగా ఆలోచన చేయాలని అధికారులకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు 5 రూపాయలకే మూడు పూట‌లా భోజ‌నం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడిన, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం అలాంటి సౌకర్యం కోసం హరేకృష్ణ మూవ్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.

రోజుకు 20 వేల మందికి రూ. 5 కే భోజనం అందిస్తామని, ఒక రోజుకి రూ. 15 లకు వేడి, తాజా ఆహారాన్ని అందిస్తామని హరీష్ రావు చెప్పారు. ప్ర‌తి ప్లేటు భోజ‌నం మీద రూ. 21 వంతున ప్ర‌భుత్వం స‌బ్సిడీ ఇస్తుంద‌ని, మొత్తం 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో దీనికోసం సుమారు రూ. 40 కోట్లు వరకు ఖ‌ర్చు అవుతుంద‌ని పేర్కొన్నారు. కాగా ఉదయం మెనూలో పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబార్ రైస్‌తో పాటు ఉదయం టిఫిన్‌కు ఆకుకూరలు ఉంటాయి. మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంలో, అన్నం, సాంబార్ లేదా పప్పు, ఆకుకూరలు మరియు కూరగాయలు మెనులో రోగి బంధువులకు వడ్డిస్తారు. డిస్పోజల్ గ్లాస్, ప్లేట్‌తో పాటు చల్లని మంచినీళ్లు కూడా సరఫరా చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =