తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరు?.. అధిష్టానం మనసులో ఏముంది?.. ఎవరికి టీపీసీసీ పగ్గాలు అందివ్వనుంది?.. అనేది కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలంతా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. తమకే పదవిని కేటాయించాలంటే తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఈక్రమంలో ఎవరి చేతికి టీపీసీసీ పగ్గాలు వెళ్తాయనేది ఉత్కంఠ భరితంగా మారింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే టీపీసీసీ అధ్యక్షుడు మార్చాల్సి ఉంది. కానీ ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుందని.. రేవంత్ రెడ్డినే తిరిగి పీసీసీ ప్రెసిడెంట్‌గా కొనసాగించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే దానిపై వారితో చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పలువురి పేర్లను హైకమాండ్‌కు సూచించారు. కోమటి రెడ్డి బ్రదర్స్, మధు యాష్కి గౌడ్, జగ్గా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సీతక్క, బలరాం నాయక్‌లతో పాటు మరికొంత మంది పేర్లను హైకమాండ్‌కు సూచించారట. ప్రస్తుతం ఆ పేర్లను పరిశీలిస్తున్న హైకమాండ్ వారిలో ఒకరిని ఎంపకి చేయనుంది. ఈక్రమంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వారిని పీసీసీ చీఫ్‌గా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. దానివల్ల పాలనా పరంగా.. అన్ని విధాలుగా ఎటువంటి సమస్యలు తలెత్తవని అనుకుంటోందట.
అయితే హైకమాండ్‌కు సూచించన వారిలో మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డికి మధ్య సన్నిహి సంబంధలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్‌ఎస్‌యూఐ స్టూడెంట్ యూనియన్ లీడర్ స్థాయి నుంచి కష్టపడుతూ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఎన్నిఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన కాంగ్రెస్‌నే అంటిపెట్టుకొని ఉన్నారు. పైగా మహేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో హైకమాండ్ మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపుతోందట. ఆయనకే పీసీసీ పగ్గాలు అందివ్వాలని భావిస్తోందట. పీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్ గౌడ్ పేరు దాదాపు ఖారారు అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని హైకమాండ్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ససస
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF