
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైన బడ్జెట్‌ను గురువారం డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన మర్నాడు అంటే జులై 26వ తేదీన అసెంబ్లీకి సెలవు కావడంతో.. 27వ తేదీన శాసనసభలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మరలా 28 వ తేదీ ఆదివారం కావడంతో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. జులై 29, జులై 30 తేదీల్లో కీలకమైన వివిధ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
జులై 31వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్.. ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానుంది . అలాగే అసెంబ్లీ చివరి రోజులయిన ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా జులై 23 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకూ ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు రేవంత్ సర్కార్ దీటుగా జవాబులివ్వడంతో.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY