రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

Achampet, Congress MP Revanth Reddy, Hyderabad, Mango News, MP Revanth Reddy, MP Revanth Reddy Rajiv Rythu Bharosa Padayatra, MP Revanth Reddy Started Rajiv Rythu Bharosa Padayatra, Rajiv Rythu Bharosa Padayatra, Rajiv Rythu Bharosa Padayatra From Achampet to Hyderabad, Revanth Reddy Rajiv Rythu Bharosa Padayatra, Revanth starts padayatra, Revanth starts padayatra in ryots support, Rythu Bharosa Padayatra

మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ చేస్తున్నారు. “రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనుక రైతు కష్టం, దుఖం, బాధ కలిసి నాలో రగిలిన ఆవేదన ఉంది. రైతు పక్షాన కాంగ్రెస్ కొట్లాటలో ఇది తొలి అడుగు” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ముందుగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పంటలకు మద్దతు ధర డిమాండ్ తో అచ్చంపేటలో ఆదివారం నాడు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌ రైతు భరోసా పేరుతో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సీతక్క, ఇతర పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో రాజీవ్ రైతు భరోసా దీక్షను రేవంత్ రెడ్డి పాదయాత్రగా మార్చుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

రాజీవ్‌ రైతు భరోసా దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి కేంద్రం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుందని చెప్పారు. సభ అనంతరం అచ్చంపేట నుండి పాదయాత్రగా ఉప్పునుంతల వరకు చేరుకున్నారు. రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని, ఉదయం మళ్ళీ హైదరాబాద్ కి పాదయాత్ర ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =