రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా.. ఈనెల 8న మంచిర్యాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష

TPCC Chief Revanth Reddy To Hold Satyagraha Initiation on April 8th For Opposing Rahul Gandhi's Disqualification,TPCC Chief Revanth Reddy To Hold Satyagraha Initiation,Satyagraha Initiation on April 8th,Satyagraha For Opposing Rahul Gandhi's Disqualification,Rahul Gandhi's Disqualification,Mango News,Mango News Telugu,TPCC Chief Revanth Reddy,Telangana Congress to launch postcard movement,Telangana Cong to launch postcard campaign,Congress leaders protest,Revanth Reddy Live,Initiation Against Rahul Gandhi,TPCC Chief Revanth Reddy Latest News,TPCC Chief Revanth Reddy Latest Updates,Rahul Gandhi's Disqualification News

లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 8న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అలాగే ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ తదితర అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిలో భాగంగానే పైకోర్టులో తీర్పు రాకముందే, రాష్ట్రపతి ఆమోదం తెలుపకముందే హడావిడిగా అనర్హత వేటు వేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దీనిని పార్టీలకు అతీతంగా ప్రధాన నేతలందరూ ముక్తకంఠంతో ఖండించారని, ఈ క్రమంలో టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 8న మంచిర్యాల కలెక్టరేట్ ఎదురుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. అలాగే మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్‌కార్డ్ ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా తదితర పార్టీల అన్ని విభాగాలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు.

ఇక ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 25 వరకు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’తో పాటు రాహుల్ గాంధీపై అనర్హత వేటు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం పెద్ద కుంభకోణం అని విమర్శించిన రేవంత్.. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఏప్రిల్ 25న సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా గద్వాల్‌లో సుమారు లక్ష మంది నిరుద్యోగ యువతతో కలిసి భారీ నిరసన సభకు ప్లాన్ చేస్తున్నామని, ఇందులో చాలా మంది బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు. కాగా మార్చి 23 న, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ సభ్యునిగా అనర్హుడైన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =