భారతదేశంలో రియల్ ఎస్టేర్ రంగంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు,హైదరాబాద్, నాగ్ పూర్, లక్నో వంటి నగరాలు ముందు వరుసలో ఉంటాయి. నిత్యం అక్కడ భారీగా స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలోనే జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే ..ముంబై లాగే.. హైదరాబాదులోనూ గుతూ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడం..హైదరాబాదులో బహుళ కంపెనీలు ఏర్పాటవడంతో రియల్ ఎస్టేట్ కొన్నేళ్లుగా రియల్టర్ల అంచనాలకు మించి ఎదుగుతోంది.సరిగ్గా రెండేళ్ల క్రితం హైదరాబాదులో..హెచ్ఎండీఏ భూములను వేలం వేస్తే.. కోకాపేట ప్రాంతంలో ఎకరం 100 కోట్లు రూపాయలకు పైగా పలికింది.. అప్పట్లో అది ఒక రికార్డ్‌గా నిలిచింది.
మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలు వస్తే చాలు కాలనీలకు కాలనీలు నీట మునిగిపోతున్నాయంటూ దీనికి ఆక్రమణలే కారణమని చెబుతూ దానికి చెక్ పెట్టడానికిి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. దీనికితోడు స్వచ్ఛమైన నీటితో పారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలని భావించి.. దీనికి భారీగా నిధులను కూడా కేటాయించింది. అయితే హైడ్రా వల్ల హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకూ ఇలాంటి ఆరోపణలు బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే చేయగా..తొలిసారిగా ఎంఐఎం కూడా ఈ పల్లవి అందుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చిందని.. దీనివల్ల ఆక్రమణలు తొలగింపు మాట ఏమిటో గాని.. హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందని ఇప్పట్లో కోలుకునే అవకాశమే కనిపించలేదన్నారు. అలాగే మూసి ప్రక్షాళనను విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిందని..అది ఎప్పుడు బాగవుతుందో తెలియదు రియల్ బూమ్ మాత్రం పడిపోయిందని ఓవైసీ అన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా తగ్గుతుందని ఆరోపించారు..
మరోవైపు రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ఫోకస్ పెంచిన తెలంగాణ సర్కార్.. భూముల విలువలు, స్టాంప్ డ్యూటీ కూడా పెంచే అవకాశం కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.. భూ భారతి పథకం అమలు తర్వాత భూముల వాల్యూలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం రియల్టర్లకు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. భూముల విలువలు, స్టాంప్ డ్యూటీ పెరిగితే అసలే పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి.. ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ తాజా నిర్ణయాలు మరింత కుంగదీస్తాయని అంటున్నారు.