గణపతి నవరాత్రులకు హైదరాబాద్ సిద్దమైంది. పలు ప్రాంతాల్లో గణపతి మండపాలు ఏర్పాటు చేసారు. భక్తితో పాటుగా ఉత్సాహంతో గణపతి ఉత్సవాలు నిర్వహణకు నగర వాసులు సిద్దమయ్యారు. ఖైరతాబాద్ లో 70 ఏళ్ల ఉత్సవాల వేళ 70 అడుగులు బడా గణేష్ తొలి పూజలు అందుకుంటున్నారు. ఇదే సమయంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి కొన్ని ఏరియాల్లో మళ్లింపులు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ నిమజ్జనాలు ముగిసే సెప్టెంబర్ 17 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను పూర్తిగా మూసి వేయగా మరికొన్ని మార్గాల్లో సమయాలను కేటాయించారు. బడా గణేష్ సందర్శనకు సొంత వాహనాలపై దర్శనానికి వచ్చే భక్తులు నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నుంచి మాత్రమే రావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ఖైరతాబాద్రైల్వే గేటు నుంచి వచ్చేవారు దర్శనం అనంతరం ఐమాక్స్థియేటర్ లేదా మిట్ కౌంపౌండ్వైపు వెళ్లాలి. మింట్ కౌంపౌండ్నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, వార్డు ఆఫీస్ ముందు నుంచి వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మిట్ కౌంపౌండ్ వైపు వెళ్లాలని సూచించారు. ఖైరతాబాద్ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్ వెళ్లొచ్చు. మిట్ కౌంపౌండ్ వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఖైరతాబాద్ వీవీ విగ్రహం నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు.
సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ నుంచి రాజ్‌దూత్ లేన్‌లో బడా గణేష్ దగ్గరికి అనుమతి లేదు. ఇక్బాల్ మినార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు ఎంట్రీ నిరాకరించారు. మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. భక్తుల భద్రత కోసం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, -13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్సైలు, 22 ప్లాటూన్ల సిబ్బంది 3 షిఫ్టుల్లో డ్యూటీలు చేయనున్నారు. 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయం కోసం 90102 03626కు కాల్ చేయొచ్చని సూచించారు.