తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సంబరాల విషయంలో పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం. మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 27, 2001 న సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ