కొనసాగుతున్న వైఎస్ షర్మిల రెండో రోజు ఉద్యోగ దీక్ష

Hunger Strike Of YS Sharmila, Hunger Strike Of YS Sharmila In Telangana, Indira Park, Lotus Pond, Mango News, telangana, Udyoga Diksha, YS Sharmila, YS Sharmila Continuing Second Day Udyoga Diksha, YS Sharmila Continuing Second Day Udyoga Diksha at Lotus Pond, YS Sharmila Hunger Strike, YS Sharmila Hunger Strike Against TRS Government, YS Sharmila Hunger Strike In Telanganan, YS Sharmila Hunger Strike News, YS Sharmila Hunger Strike Updates, YS Sharmila New Party, YS Sharmila New Party In Telangana, YS Sharmila New Party Name In Telangana, YS Sharmila New Political Party Announcement, YS Sharmila Udyoga Diksha, YS Sharmila will be Held Udyoga Deeksha

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని తన కార్యాలయం ముందు రెండో రోజు “ఉద్యోగ దీక్ష” కొనసాగిస్తున్నారు. రెండో రోజు దీక్ష సందర్భంగా వైఎస్ షర్మిలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే దీక్ష చేస్తున్న షర్మిలకు వైఎస్ విజయమ్మ సంఘీబావం తెలిపారు. నిరుద్యోగ యువతకు సంఘీభావంగా 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్టు గురువారం నాడు ఆమె ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ముందుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై “ఉద్యోగదీక్ష” పేరుతో గురువారం నాడు నగరంలోని ఇందిరాపార్కు వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష చేసేందుకే అనుమతి ఉందని, దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ వైఎస్ షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో దీక్ష వేదిక నుంచి లోటస్‌పాండ్‌ కు నడిచి వెళ్లేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నించింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకుని లోటస్‌పాండ్ ‌కు తరలించారు. అప్పటి నుంచి లోటస్ పాండ్ వద్దే వైఎస్ షర్మిల తన దీక్షను కొనసాగిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =