టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకు పెంపు

TSRJC Cet-2020: Online Application Date Extended upto September 5th

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్‌ఆర్‌జేసీ” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని గతంలో ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించగా, ప్రస్తుతం సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ-ఇంగ్లీషు మీడియం) ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పరీక్ష నిర్వహణ తేదిని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu