కరోనా తీవ్రత: ఒకేరోజు 346 మృతి, మరో 13,165 పాజిటివ్ కేసులు నమోదు

Covid-19 in Maharashtra: 346 Deaths and 13,165 New Positive Cases Reported Today

దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 19, బుధవారం నాడు ఒక్కరోజే అత్యధికంగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 13 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,642 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,033 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 9011 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 4,46,881 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,60,413 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 19 నాటికీ 33,43,052 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + two =