ప్రిలిమ్స్ రద్దుకు ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదనలు?

Andhra Pradesh Public Service Commission, AP Group-1 Exams, APPSC, APPSC Group-1, APPSC Group-1 Exams, APPSC Likely To Propose Cancellation of Prelims Pattern, APPSC Likely To Propose Cancellation of Prelims Pattern for Other Exams Except Group-1, APPSC Today Latest News, Cancellation of Prelims Pattern for Other Exams Except Group-1, Group-1, Group-1 Exams, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకంలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో గ్రూప్‌-1 మినహా మిగిలిన గ్రూప్‌-2, గ్రూప్‌-3, ఇతర కేడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. 2016 కు ముందు ఏపీపీఎస్సీ కింద గ్రూపు-1 మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించేవారు, అయితే ఉద్యోగాల భర్తీ విధానంలో మార్పులు చేస్తూ, గ్రూప్‌-1 సహా గ్రూప్‌-2, గ్రూప్‌-3, జూనియర్‌ లెక్చరర్స్, ఇతర కేడర్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా ప్రతి పరీక్షకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ విధానం ద్వారా అభ్యర్థులు కోచింగ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం, ఫీజులు/ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉండడం సహా పలు ఇతర అంశాలలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు నియామక పక్రియకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షల విధానంలో మార్పులపై గతకొంతకాలంగా ఏపీపీఎస్సీలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే గ్రూప్‌-1 మినహా ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్‌ను రద్దు చేసి, గతంలోలాగానే ఒక పరీక్ష ద్వారానే నియామకాలు చేపట్టే దిశగా ఏపీపీఎస్సీ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =