టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2020 ఫలితాలు విడుదల

Manabadi TSRJC CET Results 2020, TSRJC, TSRJC CET Results, TSRJC CET Results 2020, TSRJC CET Results 2020 Out, TSRJC CET Results Out, TSRJC CET-2020 Results, tsrjc results, tsrjc results 2020

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశానికి గానూ నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 4 న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఫలితాలను మంగళవారం నాడు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను ‌https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపీసీలో 1,500, బైపీసీలో 1,440, ఎంఇసీలో 60 సీట్లు కలిపి మొత్తం 3000 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు. ఎంపీసీ విభాగానికి సంబంధించి అక్టోబర్ 19న, అలాగే బైపీసీ, ఎంఇసీ విభాగాల‌కు అక్టోబర్ 20న కౌన్సెలింగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అర్హులైన విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే గురుకుల కళాశాలలు, తేదీలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని టీఎస్‌ఆర్‌జేసీ కన్వీనర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu