విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రం సమావేశాలు నిర్వహించినా కొన్ని అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. బుధవారం మరోసారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వర్చువల్ సమావేశం నిర్వహించారు. దీనిలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణితోపాటు అనుబంధ సంస్థ అప్మెల్, విద్యుత్ బకాయిలు, ఏపీ భవన్, ఇతర సంస్థల విభజనతో సహా పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ లోని ఏపీ భవన్ విభజనతో పాటు వివిధ బ్యాంకు డిపాజిట్లు, నగదు నిల్వల పంపకం తదితర అంశాలపై చర్చించారు.

అలాగే, షీలా బేడీ కమిటీ సిఫార్సు చేసిన అంశాలపైనా సమీక్షించారు. సింగరేణి కార్పొరేషన్‌తోపాటు అనుబంధ సంస్థలు, ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటర్నీజనరల్ న్యాయసలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. అలాగే, ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన 6,000 కోట్ల బకాయిలను తెలంగాణ డిస్కమ్ లు త్వరితగతిన చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరారు. కడప స్టీల్ ప్లాంట్ తోపాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంలో కేంద్రం సహాయ సహకారాలు అందించాలని ఏపీ అధికారులు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =