టిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, పూర్తివేతనం చెల్లించాలని నిర్ణయం

telangana, Telangana State Road Transport Corporation, TSRTC, TSRTC Employees, TSRTC Employees Salaries, TSRTC Employees will Get Full Salaries, TSRTC Employees will Get Full Salaries For June Month, TSRTC Latest News, TSRTC News

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి సగం జీతాలే చెల్లించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూన్ నెలలో పూర్తి వేతనం చెల్లించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జూన్‌ నెలకు పూర్తి వేతనం ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులవలన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మార్చి నుంచి మే నెల వరకు సగం వేతనమే ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో సంస్థలో 49 వేలకు పైగా ఉద్యోగులకు జూన్ నెలకి పూర్తి వేతనాలు చెల్లించనున్నట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu