బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు చాలా సంవత్సరాల పాటుగా బీజేపీలో కీలకంగా ఉండడంతో పాటుగా, కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాల నుంచి రెండు సార్లు పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. అలాగే దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి హయాంలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకొని నటుడు ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించనున్నారు. అలాగే ఫిల్మ్ నగర్‌లో నిర్వహించే కృష్ణంరాజు సంస్మరణ సభలో కూడా రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్:
- రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
- అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2.40 గంటలకు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటికి చేరుకుని, నటుడు ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
- అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు ఫిల్మ్‌నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.
- ఇక సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనంకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY