కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే

Cabinet Expansion, Full List of Ministers and their Portfolios in PM Cabinet, Full List of Ministers and their Portfolios in PM Narendra Modi’s Cabinet, List of 43 New Ministers, Mango News, Ministers and their Portfolios in PM Narendra Modi’s Cabinet, Modi Cabinet expansion, Modi Cabinet Expansion 2021, Modi cabinet rejig:, Modi govt cabinet expansion, PM Modi cabinet reshuffle, PM Modi cabinet reshuffle LIVE updates, Prime Minister Narendra Modi, Union Cabinet, Union Cabinet Expansaion, Union Cabinet Expansion, Union Cabinet reshuffle

కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో చేత ప్రమాణం చేయించారు. 43 మందిలో 15 కేబినెట్ మంత్రులు కాగా, 28 మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు ఇచ్చినట్టు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అలాగే 43 మందిలో కేబినెట్ లోకి 36 మంది కొత్తగా రాగా, 7 గురు మంత్రులకు పదోన్నతి కల్పించారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77 కు చేరుకుంది.

కేంద్రమంత్రులు – శాఖలు కేటాయింపు:

నరేంద్ర మోదీ : ప్రధానమంత్రి మరియు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణుశక్తి విభాగం, అంతరిక్ష శాఖ, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు.

కేబినెట్‌ మంత్రులు:

  1. రాజ్‌నాథ్‌ సింగ్‌ : రక్షణ శాఖ
  2. అమిత్‌ షా : హోంమంత్రిత్వ శాఖ, సహకార శాఖ
  3. నితిన్‌ గడ్కరీ : రవాణా, హైవేస్ శాఖ
  4. నిర్మలా సీతారామన్‌ : ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహరాలు
  5. నరేంద్ర సింగ్‌ తోమర్‌ : అగ్రికల్చర్, రైతు సంక్షేమ శాఖ
  6. సుబ్రహ్మణ్యం జయశంకర్‌ : విదేశీ వ్యవహారాలు
  7. అర్జున్‌ ముండా : గిరిజన వ్యవహారాలు
  8. స్మృతి ఇరానీ : మహిళా, శిశుసంక్షేమశాఖ
  9. పీయూష్‌ గోయల్‌ : వాణిజ్యం మరియు పరిశ్రమలు శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ, జౌళిశాఖ
  10. ధర్మేంద్ర ప్రధాన్‌ : విద్యా శాఖ, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ
  11. ప్రహ్లాద్‌ జోషీ : పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ
  12. నారాయణ్‌ రాణే : మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ
  13. సర్బానంద సోనోవాల్‌ : ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ, ఆయుష్‌ శాఖ
  14. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ : మైనారిటీ వ్యవహారాలు
  15. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ : సామాజిక న్యాయం, సాధికారత
  16. గిరిరాజ్ సింగ్‌ : గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ
  17. జ్యోతిరాదిత్య సింధియా : పౌర విమానయాన శాఖ
  18. రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ : ఉక్కు శాఖ
  19. అశ్వినీ వైష్ణవ్‌ : రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ
  20. పశుపతి కుమార్‌ పారస్‌ : ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
  21. గజేంద్రసింగ్ షెకావత్‌ : జల్‌శక్తి శాఖ
  22. కిరణ్‌ రిజిజు : లా మరియు జస్టిస్ శాఖ
  23. రాజ్‌కుమార్‌ సింగ్‌ : విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ
  24. హర్‌దీప్‌ సింగ్‌ పూరీ : పట్టణ అభివృద్ధి శాఖ, పెట్రోలియం శాఖ
  25. మన్‌సుఖ్‌ మాండవీయ : ఆరోగ్యశాఖ, రసాయనాలు, ఎరువులు శాఖ
  26. భూపేంద్ర యాదవ్‌ : పర్యావరణ, అటవీ, క్లైమేట్ చేంజ్ శాఖ, ఉపాధి, కార్మిక శాఖ
  27. మహేంద్రనాథ్‌ పాండే : భారీ పరిశ్రమల శాఖ
  28. పురుషోత్తం రూపాల : మత్స్య శాఖ, పశుసంవర్థక, డెయిరీ శాఖ
  29. కిషన్‌రెడ్డి : పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ
  30. అనురాగ్‌ఠాకూర్‌ : సమాచార-ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడలు

సహాయమంత్రులు (స్వతంత్ర హోదా) :

  1. రావు ఇందర్‌ జిత్‌ సింగ్‌ : గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, ప్రణాళిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహరాలు శాఖ (సహాయ మంత్రి)
  2. డా. జితేంద్ర సింగ్‌ : శాస్త్ర సాంకేతికాభివృద్ధి, ఎర్త్ సైన్స్‌, ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ(సహాయ మంత్రి)

సహాయమంత్రులు:

  1. శ్రీపాద యశోనాయక్‌ : ఓడ రేవులు, షిప్పింగ్‌, పర్యాటకం
  2. ఫగన్‌ సింగ్‌ కులస్థే : ఉక్కు, గ్రామీణాభివృద్ధి
  3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ : జల్‌శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
  4. అశ్వినీ కుమార్‌ చౌబే : వినియోగదారుల వ్యవహరాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ శాఖ, క్లైమేట్ చేంజ్
  5. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ : సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాలు
  6. వీకే సింగ్‌ : రవాణా, రహదారులు, పౌరవిమానయాన
  7. కృష్ణన్‌ పాల్‌ : విద్యుత్‌, భారీ పరిశ్రమలు
  8. దన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ : రైల్వే, బొగ్గు, గనులు
  9. రామ్‌దాస్‌ అథవాలే : సామాజిక న్యాయం, సాధికారత
  10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి : వినియోగదారుల వ్యవహహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి
  11. సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ : మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ
  12. నిత్యానంద రాయ్‌ : హోం శాఖ
  13. పంకజ్‌ చౌదరీ : ఆర్థిక శాఖ
  14. అనుప్రియ సింగ్‌ పటేల్‌ : వాణిజ్య, పరిశ్రమలు
  15. ఎస్పీ సింగ్‌ బఘేల్‌ : న్యాయ శాఖ
  16. రాజీవ్‌ చంద్రశేఖర్‌ : నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌
  17. శోభా కరంద్లాజే : అగ్రికల్చర్, రైతు సంక్షేమం
  18. భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ : మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్
  19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌ : రైల్వే, జౌళీ
  20. మురళీధరన్‌ : విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాలు
  21. మీనాక్షి లేఖి : సాంస్కృతిక, విదేశీ వ్యవహారాలు
  22. సోం పర్‌కాశ్‌ : వాణిజ్యం, పరిశ్రమలు
  23. రేణుకా సింగ్‌ : గిరిజన వ్యవహారాలు
  24. రామేశ్వర్‌ తేలి : పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌, ఉపాధి, కార్మికశాఖ
  25. కైలాస్‌ చౌదరీ : వ్యవసాయం, రైతు సంక్షేమం
  26. అన్నపూర్ణ దేవి : విద్యా శాఖ
  27. నారాయణ స్వామి : సామాజిక న్యాయం, సాధికారత
  28. కౌశల్‌ కిశోర్‌ : గృహ, పట్టణ వ్యవహారాలు
  29. అజయ్‌ భట్‌ : రక్షణ, పర్యాటకం
  30. బీఎల్‌ వర్మ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ
  31. అజయ్‌ కుమార్‌ : హోంశాఖ
  32. దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ : కమ్యూనికేషన్ల శాఖ
  33. భగవంత్‌ ఖుబా : పునరుత్పాదక శక్తి, రసాయనాలు, ఎరువులు
  34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్ : పంచాయతీ రాజ్‌
  35. ప్రతిమా భౌమిక్‌ : సామాజిక న్యాయం, సాధికారత
  36. సుభాశ్‌ సర్కార్‌ : విద్యాశాఖ
  37. భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ : ఆర్థిక శాఖ
  38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ : విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ
  39. భారతీ ప్రవీణ్‌ పవార్‌ : ఆరోగ్యం, కుటంబ సంక్షేమం
  40. బిశ్వేశ్వర్‌ తుడు : గిరిజన వ్యవహరాలు, జల్‌ శక్తి
  41. శాంతను ఠాకూర్‌ : పోర్టులు, షిప్పింగ్‌, జలరవాణా
  42. ముంజపర మహేంద్రభాయ్‌ : ఆయూష్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
  43. జాన్‌ బర్లా : మైనారిటీ వ్యవహారాలు
  44. ఎల్‌. మురుగన్‌ : పాడి, పశుసంవర్థక, మత్య్స, సమాచార, ప్రసారశాఖ
  45. నిషిత్‌ ప్రామాణిక్‌ : హోం శాఖ, యువజన, క్రీడా శాఖ

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =