సినీ కార్మికుల వేతనాలు పెంపు, ఎప్పటి నుంచి అమలు అంటే?

Telugu Film Chamber of Commerce Decides to Hike Wages of Telugu Film Industry Employees Federation Workers, Telugu Film Producers Council , Telugu Film Chamber of Commerce, Hike Wages of Telugu Film Industry Employees, Telugu Film Industry Employees Federation, Telugu Film Industry Employees Federation Workers, Mango News , Mango News Telugu, Telugu Film Employees, Wages Hike Of Telugu Film Industry Workers, Telugu Film Chamber, Tollywood Latest News And Updates

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ కార్మికులకు గుడ్ న్యూస్ అందింది. సినీ కార్మికుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనాలు, విధివిధానాలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరంలో చేసిన ఒప్పందంను అనుసరించి ఆ వేతనముల మీద పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచేందుకు అంగీకరించడమైనదని తెలిపారు. ఈ పెంచిన వేతనములు 2022 జూలై 01 వ తేదీ నుండి 2025 జూన్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.

ముందుగా సినీ కార్మికుల వేతనాలు పెంపు అంశంపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షుడు కె.బసిరెడ్డి, కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ.కళ్యాణ్, కార్యదర్శి టీ. ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.అనుపమ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ పిఎస్ఎన్ దొర, కోశాధికారి సురేష్ లు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సినీకార్మికుల వేతనములు, విధివిధానాలను ఖరారు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here