రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం నాడు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా నూతన జోనల్ విధానం ప్రకారం 7 జోన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో పోలీసు నియమాకాలకు తప్ప మిగిలిన అన్ని విభాగాలకు నూతన జోన్ల విధానం వర్తించనున్నది. త్వరలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నియామకాలను నూతన జోన్లవారీగానే చేపట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చే నూతన జోన్లు ఇవే:
మల్టీ జోన్ 1:
జోన్ 1: కాళేశ్వరం జోన్
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- మంచిర్యాల
- కొమురం భీం ఆసిఫాబాద్
- పెద్దపల్లి
- ములుగు
జోన్ 2: బాసర జోన్
- ఆదిలాబాద్ జిల్లా
- నిర్మల్
- నిజామాబాద్
- జగిత్యాల
జోన్ 3: రాజన్న జోన్
- రాజన్న సిరిసిల్ల జిల్లా
- కామారెడ్డి
- మెదక్
- కరీంనగర్
- సిద్దిపేట
జోన్ 4: భద్రాద్రి జోన్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- ఖమ్మం
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- మహబూబాబాద్
మల్టీ జోన్ 2:
జోన్ 5: యాదాద్రి జోన్
- యాదాద్రి భువనగిరి జిల్లా
- జనగామ
- సూర్యాపేట
- నల్గొండ
జోన్ 6: చార్మినార్ జోన్
- హైదరాబాద్ జిల్లా
- రంగారెడ్డి
- మేడ్చల్ మల్కాజిగిరి
- సంగారెడ్డి
- వికారాబాద్
జోన్ 7 : జోగులాంబ జోన్
- మహబూబ్‌నగర్ జిల్లా
- నారాయణ్ పేట్
- వనపర్తి
- జోగులాంబ గద్వాల
- నాగర్ కర్నూల్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ