రాష్ట్రంలో 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ, తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Telangana Cabinet Decisions: Second Installment of Dalit Bandhu will Distribute to 130000 Families in the State,Telangana Cabinet Decisions,Second Installment of Dalit Bandhu,Dalit Bandhu Distribute to 130000 Families,Mango News,Mango News Telugu,TS Cabinet meeting,Dalit Bandhu phase 2,Telangana Dalit Bandhu Scheme 2023,Telangana Latest News and Updates,Telangana Live News,Telangana News Today,Dalit Bandhu Latest Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్ రావు మీడియా సమావేశంలో వివరించారు. ఈ మీడియా సమావేశంలో శాసనసభా వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ జరగనుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ముందుగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2021 ఆగస్టు 16న లబ్దిదారునికి 10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటునిచ్చే దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరపాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని అమలు చేయడం జరిగిందని, మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1100 మందికి ఈ దఫాలో దళితబంధును అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ దఫా మొత్తంగా 1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు చేయడం జరుగుతుంది. మరో 200 మంది లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పగించడం జరిగింది. మొత్తంగా 1,30,000 కుటుంబాలకు దళితబంధును అందించడం జరుగుతుంది. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు లబ్దిదారులను ఎంపిక చేస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seventeen =