ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Foundation stone laid for ORR project, hmwssb free water scheme, KTR lays Foundation Stone For ORR Phase-2 Water Scheme Project, KTR to lay stone for water scheme today, Mango News, Minister KTR, Minister KTR lays Foundation Stone, Minister KTR lays Foundation Stone For ORR Phase, Minister KTR lays Foundation Stone For ORR Phase-2 Water Scheme Project, ORR project, Telangana to permanently solve drinking water, Telangana to permanently solve drinking water problem, Telangana to permanently solve the drinking water problem

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సోమవారం మంత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణలో ఇవాళ అమలు అవుతున్న పథకాలు.. రేపు దేశంలో అమలు అవుతాయన్నారు.

ఇప్పటికే మన రాష్ట్రంలో అమలవుతున్న మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుందన్నారు. హైదరాబాద్ మహానగరంలో రూ. 6వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు ప్రణాళిక ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అయినా వెంటనే రూ. 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొదలు పెట్టామని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ అంటే… జీహెచ్ఎంసీ ఒక్కటే కాదని, ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్‌గా గుర్తించాలన్నారు. దేశంలో ఇతర నగరాల కంటే హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని.. భవిష్యత్తు తరాల కోసం అవసరమైన అన్ని వనరులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాకుండా.. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =