కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఎంపీ అర్వింద్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఎంపీని ఎర్దండిలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని భూ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ అర్వింద్ కాన్యాయ్ ను అడ్డుకున్నారు. అయితే పోలీసులు కలుగజేసుకుని ఎంపీని అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలో దాడి ఘటనపై సమాచారం అందుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎంపీ క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు.
అయితే ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ దాడి ఘటనను అమిత్ షాకు తెలియజేశారు. తనపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, బీజేపీ కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ దాడులకు ప్రోత్సహిస్తోందని, దీనిని గట్టిగా ప్రతిఘటిస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తనను అడ్డుకోవడానికి స్థానిక నాయకులకు సూచనలిస్తోందని, దీనిలో భాగంగానే ఈరోజు తనపై దాడి జరిగిందని అమిత్ షా దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్రహోంమంత్రి స్పందిస్తూ.. దాడిని ఖండిస్తున్నానని, అయితే ప్రజా జీవితంలో నాయకులు అప్పుడప్పుడూ ఇలాంటివి ఎదుర్కొనాల్సి వస్తుందని, ధైర్యంగా ఉండాలని ఎంపీకి చెప్పినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ