ఆసక్తికరంగా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

BRS Govt Likely To Introduce Several Key Bills in The Three Day TS Assembly Monsoon Session,BRS Govt Likely To Introduce Several Key Bills,BRS Govt Several Key Bills,Key Bills in The Three Day TS Assembly,TS Assembly Monsoon Session,Mango News,Mango News Telugu,Telangana assembly, interesting assembly meetings, CM KCR, Apposition Parties, BJP, Congress,Governor Tamili Sai,Opposition geared up for last House session,Telangana Assembly monsoon session,Last assembly session before Telangana elections,Bill to replace Delhi Services,BRS Govt Latest News,BRS Govt Latest Updates,Assembly Monsoon Session Latest News,Assembly Monsoon Session Latest Updates

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరుగుతున్నఅసెంబ్లీ సమావేశాలు చివరివి కావడంతో ఈ సమావేశాలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు మాటల దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితులను, ప్రజలకు పూర్తిగా సహకారం అందించలేకపోయిన ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇటు వర్షాలు, వరదల పరిస్థితిని, మరోవైపు వరదలతో పంట నష్టపోయిన రైతులు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్లాన్‌ చేస్తోంది.

అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాల్లో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బీజేపీని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని తెలుస్తోంది. గవర్నర్ తమిళి సై తిప్పి పంపిన బిల్లులలో యూనివర్సిటీలలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు కూడా ఉంది. మళ్లీ ఈ బిల్లును తెలంగాణా అసెంబ్లీలో పెట్టనున్నారు. మరోవైపు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తుపై టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి సభలో చర్చకు లేవదీసి, కాంగ్రెస్ పార్టీపై కూడా ఎదురుదాడి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేయాలని.. ఏ పార్టీకి ఆ పార్టీ భావిస్తున్న సమయంలో.. ఈ శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆగస్టు 18 తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరలో ఉన్న సమయంలో శాసనసభ సమావేశాలు ఇవే చివరివి కావడంతో ఈ శాసనసభ సమావేశాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోంది..? రైతు సంక్షేమం కోసం ఏం చేస్తోంది..? వంటి అనేక విషయాలను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చెప్పే అవకాశం ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 19 =