జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని అమిత్ షా సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అక్కడి నుంచి వారాసిగూడ చేరుకున్నారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు బీజేపీ అభ్యర్థుల తరపున అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రోడ్ షోలో భారీ ఎత్తున బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోడ్ షో సందర్భంగా అమిత్ షా వెంట కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా చేరుకుంటారు. 3 గంటలనుంచి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశముంది. అలాగే రాష్ట్రనాయకులతో సమావేశం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి, ఎయిర్ పోర్ట్ కు చేరుకొని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ