భారత అండర్-19 టీ-20 టీమ్‌లో చోటు దక్కించుకున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష

Telangana Bhadradri Student Gongadi Trisha Selected For India's Under-19 T-20 Team,Gongadi Trisha Telangana girl,Indian Under-19 T-20 team,Telangana Palyer Gongadi Trisha,Mango News,Mango News Telugu,Sports News,Sports News Today,Indian Sports News Today,Indian Sports Women,Indian Sports Men,Famous Sports Women,Sports Players Of India,Indian Sports Players,Indian Tennis Players,Indian Cricket Team Players,Indian Sports Famous Players,Famous Sports Personalities Of India,Sports Personalities,Sports Personalities Of India

భారత అండర్-19 టీ-20 టీమ్‌లో తెలంగాణ అమ్మాయి చోటు దక్కించుకుంది. భారత జట్టులోని 15 మంది సభ్యులలో ఆమెకు స్థానం లభించింది. ముంబై వేదికగా జరగనున్ననవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు న్యూజిలాండ్‌తో అండర్-19 టీ-20 సిరీస్‌కు గొంగడి త్రిష ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం భారత జట్టును ప్రకటించిన ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలెక్షన్‌ కమిటీ త్రిషను సెలెక్ట్ చేసినట్లు చెప్పింది. మహిళల టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ అయిన మిథాలీ రాజ్‌ తర్వాత తెలంగాణ నుంచి భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష నిలిచింది. మొత్తం 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్‌ కెప్టెన్‌గా నియమించారు. కాగా సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం. త్రిషతో పాటు విశాఖపట్నంకు చెందిన ఎండీ షబ్నం భారత జట్టులో స్థానం దక్కించుకుంది.

భద్రాచలం టెంపుల్ టౌన్ నివాసి అయిన గొంగడి త్రిష ప్రస్తుతం స్థానికంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. త్రిష మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ ఆట పట్ల మక్కువ చూపడటంతో తండ్రి రాంరెడ్డి ఆమె ప్రతిభను గుర్తించి క్రమం తప్పకుండా క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఆటలో మెళకువలు ఒంటబట్టించుకుని ఎనిమిదేళ్ల వయసుకే అండర్‌ 16 క్రికెట్‌ జట్టుకు ఎంపికవడం విశేషం. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన త్రిష బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో సత్తా చాటుతూ మంచి ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. మహిళల అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీని ఇండియా బి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో త్రిష బీసీసీఐ నుంచి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా అందుకుంది.

ఈ నేపథ్యంలో ఆమె అండర్-19 టీ-20 టీమ్‌కు ఎంపిక కావడం వీశేషం. దీనిపై త్రిష స్పందిస్తూ.. ఇది తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొంది. అలాగే తాను చిన్నప్పటినుంచి టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎం.ఎస్‌ ధోనీని చూస్తూ పెరిగానని, అతని ఆటంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. అలాగే మహిళల టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ అయిన మిథాలీ రాజ్ అంటే కూడా తనకెంతో ఇష్టమని.. వారిద్దరి ఆటను చూసిన తర్వాత తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నానని చెప్పింది. కాగా స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌లో భారత అండర్‌-19 మహిళా జట్టు కివీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

భారత అండర్-19 మహిళల జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), శిఖా షాలోట్, త్రిష జి, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు (కీపర్), నందిని కశ్యప్ (కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =