తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దీ రోజుల్లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు డిసెంబర్ 31, మంగళవారం నాడు హుజూర్‌నగర్ లో ప్రకటించారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, త్వరలో అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటున్నానని అన్నారు. పీసీసీ పదవి కారణంగా సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని, రాజీనామా తర్వాత హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించి అందుబాటులో ఉంటానని తెలిపారు. గత కొద్దీ రోజులుగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
[subscribe]












































