మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌, డిసెంబర్ 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

CM KCR will Lay Foundation Stone for Metro Corridor from Mind Space to Shamshabad Airport on December 9,KCR Foundation For Metro Corridor,Metro Corridor Hyderabad,Metro Corridor Extension Rayadurgam To Shamshabad,Rayadurgam To Shamshabad Metro Corridor,KCR Foundation Stone Metro On Dec 9,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా మైండ్‌ స్పేస్-ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రానున్న మూడు సంవత్సరాలల్లో ఈ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నదని సీఎం పేర్కొన్నారు.

ఈ మెట్రో వయా బయో డైవర్సిటీ జంక్షన్, కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతూ వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా (రైట్ ఆఫ్ వే) మెట్రో రైలు నడుస్తుందన్నారు. మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టును రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నదని, ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here