తెలంగాణలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు దేశంలో మరెక్కడా లేవు – మంత్రి కేటీఆర్

KTR Praises Telangana CM, KTR Praises Telangana CM KCR Over His Vision and Policies, ktr siricilla tour, Mango News, Mango News Telugu, Minister KTR, Minister KTR News, Minister KTR Praises Telangana CM, Minister KTR Praises Telangana CM KCR Over His Vision and Policies, Telangana CM, Telangana CM KCR, TRS Working President KTR, TRS Working President Speech

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న రైతుబంధు, క‌ల్యాణ‌లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి సంక్షేమ ప‌థ‌కాలు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఇంకెక్కడైనా అమ‌ల‌వుతున్నాయా అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. ఈ రోజు (సోమవారం) రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. పేద ప్రజలకోసం రూ.18 వేల కోట్ల‌తో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్ర‌భుత్వం మాట ఇస్తే నిల‌బెట్టుకుంటుంది అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత పేద‌ప్రజలు ఆత్మ‌గౌర‌వంతో బ్రత‌కాల‌నే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టించి ఇవ్వటానికి పూనుకున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇలాంటి ఇళ్ళు ప్ర‌యివేటు బిల్డ‌ర్స్ నిర్మించాలంటే రూ. 20-25 ల‌క్ష‌ల వరకు ఖ‌ర్చు అవుతుంది. కానీ, ప్రభుత్వం ఉచితంగా, రాజ‌కీయాల‌కు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =