గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు (కార్యాలయాలు), ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పకుండా ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా మాస్కులు ధరించకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని 51 నుండి 60 వరకు గల సెక్షన్ల కింద, అలాగే ఐపీసీ సెక్షన్ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వం సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ