
నేతలకు ఐదేళ్లకు ఒకసారి వచ్చిన ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారు. వారి కష్టాలు, నష్టాలు అప్పటికప్పుడు తీర్చేస్తాం అన్నట్లుగా హామీలు గుప్పిస్తుంటారు. ఒకవేళ గెలిచారా ఇక ఆ పాలకులకు వచ్చే ఐదేళ్ల వరకూ ఆ ప్రజలు గుర్తుకు రావు, వారి కష్టాలు గుర్తుకు రావు. అయితే ఇలాంటి సీన్లు ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఉమ్మడి గంగాపూర్ వాసులు కూడా అనుభవించడంతో ఈసారి తీసుకున్న నిర్ణయానికి దెబ్బకు అన్ని పార్టీలు దిగివచ్చాయి.
కనీస సౌకర్యాలు లేక కడెం మండలం మారుమూల ఉమ్మడి గంగాపూర్ వాసులు ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని వారంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. వీరి నిర్ణయంతో అధికారులు, నేతలు షాక్ అయ్యారు.
ఉట్నూర్ ఆర్డీవో, ఈఆర్వో జివాకర్‌రెడ్డి, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి తాజాగా వీరి వద్దకు వెళ్లి ఎన్నికలను బహిష్కరించొద్దని కోరారు. అంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటూ గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. అంతేకాదు మూడు పార్టీల నాయకులు ..గ్రామస్తులంతా తమ హామీలను నమ్మడం కోసం వారికి బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ఓట్లు వేయడానికి ఒప్పించారు.
ఉమ్మడి గంగాపూర్ గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు అంతే కాదు కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో వంతెన నిర్మాణం పూర్తి కావాలని గ్రామస్తులు చెప్పారు. దీంతోపాటు ఎత్తిపోతల పథకం, గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా ఏర్పాటు చేయిస్తామని బీఆర్‌ఎస్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వెడ్మ బొజ్జు కూడా గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు.
ఇలా ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉమ్మడి గంగాపూర్ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసివ్వడం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో గంగాపూర్, రాణిగూడ, కొర్రతండా మూడు గ్రామ పంచాయతీల ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. రాణిగూడలో మొత్తం 494 మంది ఓటర్లు ఉండగా ఇందులో 244 మంది పురుషులు, 250 మంది మహిళలు ఉన్నారు. వీరంతా ఎస్టీ గోండు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లు పడే ఆవకాశం ఉంది.
ఇక గంగాపూర్ పంచాయతీలో మొత్తం 764 ఓటర్లు ఉన్నారు. ఇందులో 376 మంది పురుషులు, 388 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు పడే ఆవకాశం ఉంది. కొర్రతండా పంచాయతీలో మొత్తం 411 ఓటర్లు కాగా, 202 మంది పురుషులు, 209 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ లంబాడ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE