ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక చోట ఎక్కువ ఓట్లు

More votes in one seat in each constituency,More votes in one seat,one seat in each constituency,More votes in each constituency,Mango News,Mango News Telugu,Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress,district centers,votes, constituency,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates
Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress,district centers,votes, constituency

మరికొద్ది రోజుల్లో తేలనున్న తమ ఎన్నికల భవితవ్యాన్ని.. తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు తంటాలు పడుతున్నారు. ఏ నియోజకవర్గం తమకు అనుకూలం, ఏ సెగ్మెంట్లో ఎక్కువ ఓటర్లు ఉన్నారు..  ఏ గ్రామంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారున్నారంటూ రకరకాల సర్వేలు చేయిస్తూ ఆ దిశగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే  ప్రతీ నియోజకవర్గంలో   జిల్లా కేంద్రాలలోనూ, పట్టణాల్లోనే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గ్రహించిన నేతలు.. అక్కడే ఎక్కువగా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.  అక్కడే దృష్టి సారించి తమ  గెలుపోటములను ప్రభావితం చేస్తున్న ప్రాంతాల వైపు తమ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఓట్ల పరంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు గుండెకాయ లాంటి ప్రాంతాలు ఉంటాయి. అక్కడే  ఎక్కువమంది ఓటర్లు ఉండడంతో ప్రతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి. ప్రతీ ఓటు అభ్యర్థి గెలవడానికి కారణమే కానీ.. ఒక ప్రాంతంలోనే ఆ నియోజకవర్గ సగం ఓటర్లు ఉండడంతో..ఆ చోటే అభ్యర్థులకు కీలకంగా మారుతూ ఉంటుంది.  అలా ఎక్కువ ఓట్లు ఉన్న అలాంటి ప్రాంతాలపైనే  అన్ని రాజకీయ పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు  ప్రత్యేక దృష్టి సారించి తమ ప్రచారాలతో అక్కడి ఓటర్లను మరింతగా ఆకట్టుకుంటున్నారు.

ఒక అభ్యర్థి గెలవడానికి కావల్సిన  ఓట్లన్నీ ఒకే చోట ఉండడంతో అలాంటి ప్రాంతాలపై  ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. అక్కడే ఎక్కువగా రోడ్‌షోలు, సభలు, సమావేశాలు, స్టార్ క్యాంపయినర్లతో ప్రచార సభలు ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే  ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఉమ్మడి జిల్లా పరిధిలోని పది నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ఆ దిశగా తమ ప్రచార సభలకు వేదికను ఎంచుకుంటున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలు ఉన్న ప్రాంతాల్లో..జిల్లా కేంద్రాలు, పట్టణాలలోనే  ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. మంచిర్యాల నియోజకవర్గం గురించి పరిశీలిస్తే.. జిల్లా కేంద్రంలోనే సుమారు 34శాతం ఓట్లు అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత నస్పూర్‌ పట్టణంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, బోథ్‌, బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రాల్లోనే ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి.

ముథోల్‌ పరిధిలో భైంసాలో,  సిర్పూర్‌ పరిధిలో కాగజ్‌నగర్‌, చెన్నూరు పరిధిలో మందమర్రి, ఖానాపూర్‌ పరిధిలో ఉట్నూరులో మెజార్టీ ఓటర్లు ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం స్థిరపడడంతో ప్రతీ నియోజకవర్గంలో 30- 40శాతం ఓట్లే అక్కడే ఉంటున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, బహిరంగ సభలు,  ప్రచారాలు చేయడానిక ఈ ప్రాంతాలపైనే నేతలంతా ఎక్కువ దృష్టి సారించారు. తక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాలను తర్వాత ప్రియారటిని ఇస్తూ దానికి తగినట్లుగా సమయం కేటాయిస్తూ తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

సమయం లేదనుకున్నవాళ్లు, అంత ఖర్చు పెట్టలేమని భావిస్తున్నవాళ్లు.. ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే  కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గం మొత్తం తిరగలేని వారంతా ఇలాంటి  ప్రాంతాలపైనే దృష్టి సారించారు. ఈ ఎన్నికలలో డిపాజిట్లు నిలబెట్టుకోవడానికి తమ ప్రయత్నం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =