ఏపీ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా భేటీ అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారన్నారు. తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్నారు. మరి తెలంగాణలో టీడీపీ బలపడుతుందా..? రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ కి తోడుగా టీడీపీ కూడా స్థానిక సంస్థలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ..? ఎన్డీఏ లో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మళ్లీ నిజంగానే పూర్వవైభవం సాధించే అవకాశముందా..? అన్న ఆలోచనలు ఆ పార్టీ కార్యకర్తల్లో మొదలయ్యాయి.
టీడీపీ పార్టీ ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది. 35 శాతం ఓట్లతో బీజేపీ 8 సీట్లు సాధించింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్టీ తెలంగాణలో రాజకీయం చేసే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు అభిమానులు చెప్పుకుంటున్నారు. విభజనకు ముందు తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న పార్టీ టీడీపీ. ప్రతి గ్రామంలోనూ టీడీపీకి భారీగా క్యాడర్ ఉండేది. అయితే రాష్ట్ర విభజన అయ్యాక తెలంగాణలో టీడీపీ అత్యధికంగా దెబ్బతిన్నది. అయినప్పటికి 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ 15సీట్లను సాధించింది. బీజేపీ సైతం 5 సీట్ల ను సాధించింది. 2018 లో కూడా మహాకూటమిలో భాగంగా పోటీ చేసిన టీడీపీ ఖమ్మం జిల్లాలో 2 సీట్ల ను గెలుచుకుంది. ఆ తర్వాత క్రమంలో టీడీపీ పార్టీ బలహీనపడుతూ వచ్చింది.
ఏపీలో టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ సాధించడంతో… చంద్రబాబు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో మూలన పడ్డ సైకిల్‌ను..తిరిగి రేసులో పెట్టే పని ప్రారంభించారు. ఆ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని..త్వరలోనే ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేస్తానని భరోసా ఇచ్చారు..పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ శ్రేణులు చెప్పిన గ్రాండ్ వెలకమ్ చూస్తే.. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన టీడీపీ క్యాడర్‌లో.. కాస్త జోష్ వచ్చిన మాట వాస్తవమే. అయితే టీడీపీ పునర్వైభవం వచ్చే పరిస్థితులు ఉన్నాయా అన్నది ప్రధాన ప్రశ్న. చరిత్ర చూసుకుంటే ఇప్పటివరకు సీమాంధ్ర మూలాలు ఉన్న ఏ రాజకీయ పార్టీ తెలంగాణలో లో సక్సెస్ కాలేదు. అందుకు ఉదాహరణే వైసీపీ, పీఆర్పీ, జనసేన, వైఎస్సార్ తెలంగాణ పార్టీలే. తెలంగాణ మీద ఫోకస్ చేసినా మనుగడ సాగించలేకపోయాయి. ఎందకంటే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఏపీలో బీజేపీ అంతగా క్యాడర్ లేదు ఆ పార్టీ కి బలమూ లేదు. కాని కూటమి పొత్తులో భాగంగా ఆ పార్టీ పోటీ చేసి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలంగా తయారవుతోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ సహాయంతో టీడీపీ కూడా జీహెచ్ ఎన్నికల్లో పోటీ చేసి తద్వారా మెల్లి మెల్లిగా పునర్వైభవం సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE