ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

2021 Ugadi Festival, janasena chief, janasena chief pawan kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan Extends Ugadi Wishes, Sri Plava Nama Ugadi Greetings, Sri Plava Nama Ugadi Greetings JanaSena Chief Pawan Kalyan, ugadi festival, Ugadi Festival Celebrations, Ugadi Festival Wishes, Ugadi Festival Wishes 2021, Ugadi Festival Wishes to People, Ugadi Greetings To The Telugu People, YS Jagan Extends Ugadi Wishes

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. “సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతోనే మనోవికాసం పరిమళిస్తుంది. మానవత్వం గుభాళిస్తుంది. అటువంటి సుసంపన్న సంప్రదాయాన్ని తరతరాలకు చేరవేస్తున్న పండుగ మన ఉగాది. చైత్ర మాసపు పరిమళాలతో తరలివచ్చే ఈ ఉగాది తెలుగువారందరికీ కొత్త వసంతంలో తొలి పండుగ. అటువంటి ఈ ఉగాది ప్లవ నామధేయంతో తరలి వచ్చింది. ఈ పండుగ తరుణాన తెలుగు రాష్ట్రాల్లోనేగాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన శ్రేణులు పక్షాన ఉగాది శుభాకాంక్షలు. ‘ప్లవ’ అంటే దాటించునది అని అర్థం. ప్రజల కష్టాలను, కరవుకాటకాలను ఈ ప్లవ నామ ఉగాది సంపూర్ణంగా దాటించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ క్షేమంగా దాటిపోవాలని, వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఈ ఉగాది ప్రసాదించాలని భగవంతుణ్ని వేడుకుంటున్నాను. కొవిడ్ కోరలు చాస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, కొవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =