వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

AP News, Mango News, Mango News Telugu, MP Pilli Subhash Chandra Bose Collapsed, MP Pilli Subhash Chandra Bose Collapsed in Rajya Sabha, Pilli Subhash Chandra Bose, Pilli Subhash Chandra Bose Collapsed in Rajya Sabha, rajya sabha, YCP MP Pilli Subhash Chandra Bose, YCP MP Pilli Subhash Chandra Bose Collapsed, YCP MP Pilli Subhash Chandra Bose Collapsed in Rajya Sabha, YCP MP Pilli Subhash Chandra Bose Collapsed in Rajya Sabha Due To Illness, YCP MP Pilli Subhash Chandra Bose Collapsed in Rajya Sabha Due To Illness Admitted in To Hospital

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఈరోజు రాజ్యసభ లో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలియవచ్చింది. అయితే, వెంటనే అప్రమత్తమైన సహచర ఎంపీలు వెంటనే స్ట్రెచర్ తెప్పించి సుభాష్‌ చంద్రబోస్‌ను ఢిల్లీలోని ప్రముఖ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యవర్గాల ద్వారా తెలిసింది. కాగా, ప్రస్తుతం ఎంపీకి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం.. తదనంతర పరిస్థితుల్లో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీ తరపున ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. కాగా.. ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఎంపీకి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ఎంపీలకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + four =