కేసు వాపస్ తీసుకుంటా: శ్రీతేజ్ తండ్రి భాస్కర్

Will Withdraw The Case Sree Tejs Father Bhaskar, Allu Arjun, Pushpa 2, Sandhya Theater, Sree Tej’S Father Bhaskar, Will Withdraw The Case, Movie Premiere Tragedy, Pushpa 2 Stampede, Sandhya Theater Issue, Sandhya Theatre Incident, Tollywood Benefit Shows Ban, Theater Premiere Tragedy, Pushpa 2 Controversy, Sandhya Theater, Allu Arjun, Rashimka, Sukumar, Pushpa 2 Movie, Pushpa 2 Latest News, Allu Arjun Pushpa 2 Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఇప్పుడు కాస్త మెరుగుపడుతుందని డాక్టర్లు రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్‌.. అల్లు అర్జున్ కి ఆయన అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. త్వరలో శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మామూలు స్థితికి రాబోతున్నాడు. అయితే రేవతి భర్త భాస్కర్ మొదటి నుంచీ కూడా అల్లు అర్జున్ కి సపోర్టు గా ఉంటున్న సంగతి తెలిసిందే.సంధ్యా థియేటర్ ఘటనలో నిన్న కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల విచారణను ఎదుర్కొన్నాడు.

ఇలాంటి సమయలో భాస్కర్ నిన్న ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి.. అల్లు అర్జున్ మీద తాను వేసిన కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాబు కి ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ గారి నుంచి సపోర్ట్ కావాలని కోరుకున్నాము. మాకు రెండో రోజు నుంచే ఆయన నుంచి, ఆయన టీం నుంచి సపోర్ట్ దొరికింది. అన్ని విధాలుగా వాళ్లు మమ్మల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

అయినా కూడా ఆయన మేము వేసిన కేసు వల్లే అరెస్ట్ అయ్యాడనే బాధతో ..ఆ కేసుని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. మా వల్ల అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం అనేది అసలు నచ్చలేదు. పూర్తిగా నా అభిప్రాయం మేరకే కేసుని వెనక్కి తీసుకుంటున్నాను .నా మీద ఎవ్వరూ ఒత్తిడి పెట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ తేజ్ తండ్రి చెప్పాడు.

అర్జున్ రేవతి ఘటన జరిగిన తర్వాత అల్లు పాతిక లక్షల రూపాయిలను ఆ కుటుంబానికి ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పాతిక లక్షల్లో ఇప్పటి వరకు ఆయన పది లక్షల రూపాయలు డీడీ అందించారని.. మిగిలిన డబ్బులు త్వరలోనే ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా పుష్ప 2 నిర్మాతలు కూడా తమ తరుపున 50 లక్షల రూపాయల చెక్ ని అందచేశారు.