తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్

#KCR, Mango News Telugu, One Nation One Ration Card Scheme, One Nation One Ration Card Scheme Begins, One Nation One Ration Card Scheme Begins In Telangana, One Nation One Ration Card Scheme Begins In Telangana State, One Nation One Ration Card Scheme In Telangana, One Nation One Ration Card Scheme Telangana, telangana, Telangana News, Telangana Political Updates

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆగస్టు 9, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ప్రారంభించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రేషన్ కార్డు యొక్క పోర్టబిలిటీ విధానం ఆగస్టు 9 నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలు ఎక్కడినుంచైనా సరుకులను తీసుకునే వెసులు బాటు కలుగుతుంది.

హైదరాబాద్ లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ నేషన్-వన్ రేషన్ విధానాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేస్తునట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డు వివరాలను, తెలంగాణ లోని రేషన్ కార్డు వివరాలను నేషనల్ పోర్టబిలిటీ ద్వారా అనుసంధానం చేసామని, ఇక తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ ద్వారా సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన కార్డులకు మాత్రమే ఈ పోర్టబిలిటీ విధానం వర్తిస్తుందని సమాచారం. మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల్లో కూడ ఈ విధానం శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలియజేసారు.

 

[subscribe]
[youtube_video videoid=41EY7re-GGc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =