టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023: దరఖాస్తు గడువు మార్చి 31వరకు, ప్రవేశ పరీక్షమే 6న నిర్వహణ

TSRJC CET-2023: Online Application Last Date March 31st Exam to be Held on May 6th,TSRJC CET-2023,TSRJC CET Online Application Last Date,TSRJC CET Application March 31st,TSRJC CET Exam to be Held on May 6th,Mango News,Mango News Telugu,TSRJC CET Latest News,TSRJC CET News and Updates,TSRJC CET Updaes,TSRJC CET Application,TSRJC CET Latest News and Live Updates

తెలంగాణ రాష్ట్రంలో 35 గురుకుల‌ (రెసిడెన్షియల్) జూనియర్‌ కళాశాలల్లో 2023-24 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023” పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభం కాగా, దరఖాస్తు గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. కాగా ఈ ప్రవేశ పరీక్షను మే 6వతేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “2023-24 విద్యా సంవత్సరానికి, తెలంగాణ రాష్ట్ర గురుకుల ( రెసిడెన్షియల్) విద్యాలయముల సంస్థ ఆధ్వర్యంలో నడుపబడుచున్న 35 గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశం కొరకు 2023, ఫిబ్రవరి 25 నాటి ప్రకటనననుసరించి 2023 ఏప్రిల్ నెలలో పదవ తరగతి పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు 2023, మార్చి 31 వరకు ఆన్‌లైన్ (http://tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. పరీక్ష తేది 2023, మే 6” అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 కలిపి మొత్తం 35 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉండగా, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ సెట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశపరీక్ష మల్టీపుల్​ చాయిస్​ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉండనుంది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 20 =