
వీకెండ్స్ వస్తున్నాయంటే చాలామంది ఆల్కహాల్ లవర్స్ వైన్ షాపుల ముందు క్యూ కడతారు. కానీ జులై 28,29 తేదీలతో మందుతో వీకెండ్ చిల్ అవుదామనుకున్న భాగ్యనగరవాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ చిన్న షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సిటీ మరియు శివారు ప్రాంతాలలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు మూసివేయనున్నారు. మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మొత్తంగా నాన్ ప్రాప్రయిటరీ లేని క్లబ్బులు, స్టార్ హోటల్స్‌తో పాటు, రెస్టారెంట్లు, వైన్ షాపులను మూసివేయబోతున్నట్లు సీపీ కోట శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేశారు.
జులై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మొదలయిన అన్ని వైన్ షాపుల మూసివేతను రెండు రోజుల పాటు కంటెన్యూ చేయనున్నారు. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు అంటే..మళ్లీ సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. .
ప్రధానంగా హైదరాబాద్ సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొగల్‌పురా, చత్రినాక, శాలిబండ, మీర్‌చౌక్, డబ్బీర్‌పుర ప్రాంతాల్లో 28న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం విక్రయించే చిన్నచిన్న దుకాణాలు, వైన్‌షాపులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులను మూసివేస్తున్నట్లు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు.. కల్లు దుకాణాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. తాము జారీ చేసిన ఈ ఉత్తర్వులు జులై 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా అమలులో ఉంటాయని తెలిపారు.
భాగ్యనగరంలో..ఆషాడమాసం ప్రారంభం నుంచి బోనాల పండుగ కొనసాగుతున్నాయి. బోనాలలో చివరి ఆదివారం కావడంతో..శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా అంబారీపై మహంకాళీ అమ్మవారి ఊరేగింపు జరగనుంది. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలను టచ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ వేడుకలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి.. వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ చెప్పారు.
పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా మహంకాళీ అమ్మవారి ఊరేగింపు యాత్ర కొనసాగుతుంది. దీనికనుగుణంగా వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాల్ దర్వాజ బోనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సిటీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో… ఈ ఉత్తర్వులు జూలై 28 వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE