ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఆ పార్టీదే..?

Mango News Exit Polls Report,Mango News Exit Polls,Exit Polls Report,Exit polls, Telangana assembly elections, BJP, BRS, Congress,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Polling Latest News,Mango News Polls Latest Updates
mango news, exit polls, telangana assembly elections, bjp, brs, congress

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయింది. డిసెంబర్ 3న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందనే దానిపై పలు సంస్థలు సర్వే చేసి సంచలన నివేదికలను బయటపెడుతున్నాయి.

మ్యాంగ్ న్యూస్ సర్వే నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ 48-58 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ 58-67 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉంది. బీజేపీ 7-13 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో, ఇతరులు 6-8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని మ్యాంగో న్యూస్ నివేదికలో తేలింది.

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్‌ 48, కాంగ్రెస్ 56, బీజేపీ 10, ఎంఐఎం 5 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 65, బీజేపీ 4, ఇతరులు 9 స్థానాలు కైవసం చేసుకునే చాన్స్ ఉంది. జనం సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్ 26-37, కాంగ్రెస్ 66-77, బీజేపీ 4-9, ఎంఐఎం 6-7, ఇతరులు 0-1 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 40-55 స్థానాల్లో, కాంగ్రెస్ 48-64 స్థానాల్లో బీజేపీ 7-13 స్థానాల్లో ఎంఐఎం 4-7 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =