ఈ ఏడాది చైనా వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీలలో నిర్వహించనున్నారు. చైనాలోని టియాంజిన్ నగరం ఈ సదస్సుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, పక్కా ప్రణాళికలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని బోర్గె బ్రెండే ప్రశంసించారు. కాగా ఇంతుకుముందు కూడా మంత్రి కేటీఆర్ వివిధ దేశాలలో నిర్వహించబడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌లలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొన్నారు. తద్వారా రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలను రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేలా చేయగలిగారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE