ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కీలక ప్రతిపాదన చేసిన కేంద్ర హోంశాఖ

Central Home Ministry Makes Key Proposal on The Division of AP Bhavan in Delhi,Central Home Ministry Makes Key Proposal,Division of AP Bhavan in Delhi,Central Home Ministry In Delhi,AP Bhavan in Delhi,Mango News,Mango News Telugu,Centre proposes new option for division of AP Bhavan,AP Bhavan Delhi,Division of Delhi AP Bhavan,AP Bhavan,Central Home Ministry Latest News And Updates,AP Bhavan Latest News And Updates

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కాగా ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు అనేకసార్లు ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోం శాఖ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 26న రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశమయింది. ఆ సమావేశ వివరాలను ఇరు రాష్ట్రాల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా పలు కీలక నూతన ప్రతిపాదనలను హోం శాఖ చేసింది. ఇక గతంలోనే భూములు, భవనాల విభజనపై ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేయగా.. తెలంగాణ తాజాగా ఆస్తుల విభజనపై మరో ప్రతిపాదన పెట్టింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ పక్కన ఖాళీ స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ప్రతిపాదించింది. అయితే తెలంగాణ ప్రతిపాదనకు పూర్తి భిన్నమైన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ చేసింది.

ఈ ప్రతిపాదన ప్రకారం.. పటౌడీ హౌస్‌లో 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు గోదావరి, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌ను ఏపీ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని సూచించింది. ఈ ఆస్తులను ఏపీ, తెలంగాణలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్రం సూచించింది. ఒకవేళ ఈ పద్దతిలో ఏపీకి అదనంగా భూమి వస్తే అందుకు సమాన విలువను ఏపీ నుంచి తెలంగాణకు అందించాలని పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఏపీ, తెలంగాణలకు రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కనుంది. ఈ మూడు ఆప్షన్లను ఏపీ ప్రభుత్వం పరిశీలించి, కేంద్ర ప్రతిపాదన ఆచరణీయమని వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. దీంతో ఇరు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =