ఇక ఆన్లైన్ల్‌లోనే సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసుకోవచ్చు

You Can Now Apply For CMRF Online, CMRF Online, CMRF Online Apply, Below Poverty Line, CMRF, cmrf.Telangana.Gov.In, Now Apply For CMRF Online, Hyderabad, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెలంగాణలో ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్న విషయం తెలిసిందే . నిరుపేదల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ సాయం మంజూరు చేస్తుంది. అయితే దీనికోసం చికిత్స పొందిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ నియోజకవర్గంలోని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు.

చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స పొందిన తర్వాత సీఎం సహాయ నిధి నుంచి సాయం కోసం అప్లై చేసుకుంటారు. దీనికోసం చాలామంది మీసేవ కేంద్రాలు లేదా మధ్యవర్తుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే దీనికోసం ఏయే పత్రాలు కావాలి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిస్తే ఇకపై ఆన్ లైన్లోనే అప్లై చేసుకుని ఈ సాయం పొందొచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ దరఖాస్తులు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించబడతాయి. అధికారిక వెబ్‌సైట్‌ అయిన cmrf.telangana.gov.in ద్వారా దీనికోసం దరఖాస్తు చేయాలి. దీనికోసం దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డ్‌ , దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, ఒరిజినల్‌ ఇ–ఆదాయ సర్టిఫికేట్‌ లేదా తక్కువ ఆదాయం ఉన్నవారికి అర్హత ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుడి బ్యాంక్‌ ఖాతా నంబర్, IFSC కోడ్, బ్యాంక్‌ పేరు రాసి ఫిల్ చేయాలి.

అలాగే ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులు లేదా ఆసుపత్రి నుంచి చికిత్సకు సంబంధించిన ఎస్టిమేట్‌ అప్లై చేయాలి. చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జ్‌ సమ్మరీ , కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉందని రుజువు చేయడానికి రేషన్‌ కార్డ్‌ ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రి లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రి నుంచి అప్లై చేస్తున్న వ్యక్తి యొక్క వైద్య సమస్యను వివరించే సర్టిఫికేట్‌ ఉండాలి. కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నుంచి సిఫారసు లెటర్ కూడా కావాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారుడు తెలంగాణ వాసి అయి ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు అంటే వైద్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు వంటి బారిన పడినవారు. వైద్య సహాయం కోసం అయితే, క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి పెద్ద వ్యాధులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ పరిమితం.

ముందుగా cmrf.telangana.gov.in లోకి వెళ్లండి. మీ వివరాలన్నీ అక్కడ రిజిస్టర్‌ చేసుకుని ..ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అలాగే పైన పేర్కొన్న డాక్యుమెంట్ల స్కాన్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత, ఒక యూనిక్‌ CMRF కోడ్‌ జనరేట్‌ అవుతుంది. దీనిని భద్రపరచాలలి.

అవసరమైతే ఒరిజినల్‌ బిల్లులను సచివాలయంలో సమర్పించాలి. సహాయం చేయడం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. అందుకే సమస్యను స్పష్టంగా వివరించే సరైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలనుకుంటే వెబ్‌సైట్‌ను తనిఖీ చేయడం లేదా టోల్‌–ఫ్రీ నంబర్‌ 1902కు సంప్రదించాలి.