ఈడీ ద‌ర్యాప్తుకు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తా, నిజాలు తేల్చాల్సిన బాధ్య‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల‌దే – మంత్రి గంగుల కమలాకర్

Telangana Minister Gangula Kamalakar Responds Over ED Raids on His Residence and Companies,Telangana Minister Gangula Kamalakar,FCI extended CMR till November 30, Telangana Rs. 180 crore profit , Minister Gangula Kamalakar, Mango News, Mango News Telugu, Telangana will Get Rs 180 Cr Profit, Telangana Latest News And Updates, CMR Deadline Extends, CMR Deadline Extends by FCI, FCI, FCI Extended CMR Deadline, Food Corporation of India, Food Corporation of India News And Updates

తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సంస్థలు దాడులు చేయడం తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ పౌరసరఫరాల మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ నివాసం మరియు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. అయితే ఈ సమయంలో మంత్రి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ముగ్గురు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారులతో సహా 12 మంది సభ్యుల బృందం కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి వచ్చి సోదాల అనంతరం ఏడు బ్యాగుల్లో ముఖ్యమైన పత్రాలను తీసుకెళ్లారు. దాడులకు సంబంధించి సమాచారం అందడంతో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను 32 సంవత్సరాలుగా మైనింగ్ వ్యాపారంలో ఉన్నానని, ఎల్లప్పుడూ చట్ట పరిధిలో, పారదర్శకంగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు కాబట్టి తాను మంత్రినైనా ఐటీ, ఈడీ సంస్థ‌ల ద‌ర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందిస్తానని స్ఫష్టం చేశారు. అందుకే విషయం తెలియగానే 12 గంటల్లోనే ఇండియాకు తిరిగొచ్చానని, అన్నీ క్లారిటీ చేసుకునే మళ్ళీ దుబాయ్ వెళ్తానని ఆయన తెలిపారు. తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు ఈడీ అధికారుల‌కు ఇంటి తాళాలు తీయ‌మ‌ని చెప్పింది తానేనని, ఇంట్లోని ప్ర‌తి లాక‌ర్‌ను ఓపెన్ చేసి చూసుకోమ‌ని చెప్పానని వెల్లడించారు. అలాగే సోదాల్లో ఏం దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో దర్యాప్తు అధికారులే చెప్పాలని, దీనిలో నిజ‌నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్య‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల‌దేనని తేల్చి చెప్పారు. ఇక మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని, బయటి దేశాల నుంచి హవాలా మార్గంలో డబ్బులు ఏమైనా తెచ్చామా అనేది ఈడీ పరిధిలోనిదని మంత్రి గంగుల తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =