తెలంగాణాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మరియు మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులతో బుధవారం మంత్రి కేటీఆర్ వేర్వేరుగా సమావేశమైన అనంతరం ప్రకటన విడుదల చేశారు. దిగ్గజ సంస్థల నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గ్లోబల్ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఆర్థిక శాఖ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చల అనంతరం హైదరాబాద్‌లో మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ప్రవేశించడానికి అలెగ్జాండ్రా తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దీనిద్వారా సుమారు 1,200 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇక మీడియా మరియు వినోద పరిశ్రమలో వృద్ధి మరియు ఆవిష్కరణలను నడపడంలో ఇరుపక్షాల భాగస్వామ్య దృష్టిని చర్చలు హైలైట్ చేశాయని మంత్రి కేటీఆర్ బృందం ప్రకటన తెలిపింది.
ఇక మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్ సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. కాగా మెడ్‌ట్రానిక్ ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యాధునిక ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్, టెస్ట్ ఆటోమేషన్, మెకానికల్ డిజైన్, ఎనాలిసిస్ మరియు హార్డ్‌వేర్ రంగాలలో ఇంజనీర్‌లు పనిచేస్తున్నారు. కాగా, తాజా ప్రకటనతో అమెరికా వెలుపల మెడ్‌ట్రానిక్స్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తుండటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE