ఒడిశాలో తొలి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Flags Off Odisha's First Vande Bharat Express Train Today Launches Railway Projects Worth Rs 8200 Cr,PM Modi Flags Off Odisha's First Vande Bharat Express,Odisha's First Vande Bharat Express Train Today,PM Modi Launches Railway Projects,Modi Launches Railway Projects Worth Rs 8200 Cr,Mango News,Mango News Telugu,Modi flags off Odishas first Vande Bharat,PM Modi dedicates rail projects,PM Modi Latest News,PM Modi Latest Updates,PM Modi Live News,Odishas First Vande Bharat News Today,Odisha's First Vande Bharat Live News,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. పూరీ స్టేషన్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేష్ లాల్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంవిత్ పథ్ తదితరులు పాల్గొన్నారు. వందే భారత్ రైలు ఈరోజు ఉదయం 6:10 గంటలకు హౌడా నుంచి పూరీకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మధ్యాహ్నం 12:25 గంటలకు పూరీకి చేరుకున్న తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ 12:56 గంటలకు ప్రారంభించారు. పూరి స్టేషన్ నుండి మధ్యాహ్నం 1:50 గంటలకు బయలుదేరి రాత్రి 8:30 గంటలకు హౌరా చేరుకుంటుంది.

కాగా ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మరియు ఒడిశాలోని పూరీల మధ్య 500 కి.మీల దూరాన్ని తగ్గించనుంది. అలాగే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని దాదాపు ఆరున్నర గంటల్లో పూర్తి చేయనుంది. ఇక మొత్తం 16 కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూరీ, జాజ్‌పూర్, ఖుర్దా, బాలేశ్వర్, పశ్చిమ, తూర్పు మదీనాపూర్ మీదుగా నడుస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఇక ప్రధాని మోదీ ఈరోజు ఒడిశాలో రూ. 8,000 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. కాగా ప్రధాని మోదీ ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌లలో ఈ అత్యాధునిక రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 6 =