తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మొదటగా మే 31 వ తేదీ వరకు మాత్రమే పంటల కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో జూన్ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలు ప్రారంభం కాకముందే రైతులు తమ తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu