కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జేఎన్‌టీయూ-హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. జూన్ 20 వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అలాగే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్‌టీయూ-హైదరాబాద్ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
జేఎన్‌టీయూ-హైదరాబాద్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు:
- విద్యార్థులు చదువుకున్న కాలేజిలోనే పరీక్షల నిర్వహణ
- పరీక్షల సమయం 2 గంటలకు కుదింపు
- 20 నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు
- ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన సంవత్సరం విద్యార్థులకు డిటెన్షన్ విధానం రద్దు
- ఏవైనా కారణాల దృష్ట్యా ఈ పరీక్షలకు హాజరుకాలేకపోతే, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu