ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 3కే‌ రన్‌

Azadi Ka Amrut Mahotsav, Azadi Ka Amrut Mahotsav 3K Freedom Run, Azadi Ka Amrut Mahotsav 3K Freedom Run News, Azadi Ka Amrut Mahotsav 3k Run, Azadi Ka Amrut Mahotsav at Public Gardens, Azadi Ka Amrut Mahotsav In Telangana, Azadi Ka Amrut Mahotsav Programme, CS Somesh Kumar, DGP Mahender Reddy, Mango News, Telangana Azadi Ka Amrut Mahotsav

75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నేక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద 3కే రన్‌ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో పెద్దఎత్తున క్రీడాకారులు, యువతీ యువకులు, ఉద్యోగులు అధికారులు దాదాపు 3 వేలమంది పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన ఈ రన్ లుంబిని పార్క్, లక్డికాపూల్, కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్.బి స్టేడియం వరకు చేరుకుంది. ఈ రన్ లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు కొద్దీ దూరం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తిని దేశ ప్రజల్లో నింపేందుకు ఆజాదీ కా అమృత్ వర్ష్ అనే పేరుతొ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ ఘనమైన చరిత్ర, దేశ స్వతంత్ర పోరాటంలో సమర యోధులు చేసిన త్యాగాల గురించి భావితరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేసి 75వ స్వతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది మేధావులు, యువతీయువకులు ఎన్నో కలలతో పుట్టినిల్లని, భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతున్న దేశం మన భారత దేశం అని కొనియాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన విధానం, స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను తెలుసుకోవడంతో పాటు, మహనీయులు యొక్క జీవిత చరిత్రలు చదవాలని యువతకు సూచించారు. మహనీయులు యొక్క త్యాగ ఫలితమే ప్రస్తుత స్వేచ్ఛా, స్వాతంత్రాలను అనుభవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పుడూ మనం మరువద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ క్రీడల సంఘాల అధ్యక్షులు, క్రీడాకారులు, విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 12 =