బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి గాయాలు, స్పందించిన మంత్రి కేటీఆర్

Two Persons Lost Lives and Several Injured in Fire Mishap at BRS Athmeeya Sammelan in Khammams Karepalli Minister KTR Condoles,Two Persons Lost Lives and Several Injured,Fire Mishap at BRS Athmeeya Sammelan,Khammams Karepalli Condoles,Minister KTR Condoles,Two Persons Lost Lives in Fire Mishap,Mango News,Mango News Telugu,One killed as fireworks during BRS Meeting,A Fatal Accident in The BRS spiritual compound,One Dead in Fire Accident Near BRS meet,One Killed as Fireworks During BRS Meeting,Fire Mishap at BRS Latest News,BRS Fire Acccident Latest Updates,BRS Fire Acccident Live News

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడు వ‌ద్ద ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వేదిక సమీపంలో బుధవారం ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సహా పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. చీమ‌ల‌పాడు వ‌ద్ద నిర్వ‌హించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ నామా నాగేశ్వరరావు మరియు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో నిప్పుర‌వ్వలు ఎగిరిప‌డి స‌భా ప్రాంగ‌ణానికి 200 మీట‌ర్ల దూరంలో ఉన్న ఒక గుడిసెపై ప‌డ్డాయి. దీంతో బీఆర్‌ఎస్ కార్మికులు, పోలీసు అధికారులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా.. ఆ గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకుని అది పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక వెంటనే స్పందించిన పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సిలిండర్ పేలుడు ధాటికి అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ సహా మరికొందరికి కాళ్ళు, చేతులు తెగి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. దీంతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారడంతో పోలీసులు దగ్గరుండి సహాయక చర్యలను చేపడుతున్నారు.

ఇక ఈ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయన ఖ‌మ్మం జిల్లా బీఆర్ఎస్ నేత‌లు, అధికారుల‌తో కేటీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని, క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకుంటామ‌ని భరోసానిచ్చారు. అలాగే జరిగిన ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందిస్తూ.. ‘మేము వేదిక వద్దకు చేరుకున్నప్పుడు ఇది జరిగింది. కొంతమంది గుడిసెలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్‌పీజీ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి వారి పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని వైద్యులను కోరాను. మరికొంతమందిని పరిస్థితిని బాతి ఖమ్మం పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 13 =